సిద్ధూ ను బహిష్కరించాలి

సీబీఎస్​ ఎ అధికారిగా విధులు

Oct 19, 2024 - 12:57
 0
సిద్ధూ ను బహిష్కరించాలి

కెనడా ప్రభుత్వానికి భారత్​ నోటీసులు
బల్వీందర్​ సింగ్​ సంధు హత్యలో కీలకపాత్ర

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ కెనడా ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న సందీప్​ సింగ్​ సిద్ధూను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని భారత్​ నోటీసు జారీ చేసింది. శనివారం ఈ నోటీసును కెనడా విదేశాంగ శాఖకు భారత్​ విదేశాంగ శాఖ పలు ఆధారాలతో సహా జారీ చేసింది. కెనడా ప్రభుత్వం సీబీఎస్​ ఎ (కెనడియర్​ బోర్డర్​ సర్వీస్​ ఏజెన్సీ) అధికారిగా సిద్ధూ విధులు నిర్వహిస్తున్నాడని పేర్కొంది. 

2020లో భారత్​ లో బల్వీందర్​ సింగ్​ సంధు హత్యలో పాక్​ ఐఎస్​ తోపాటు ఖలిస్థానీ ఉగ్రవాదులతో కలిసి సిద్ధూ పనిచేశాడని ఆరోపించింది. పంజాబ్​ లో వేర్పాటు ఉద్యమానికి కూడా ఇతను ప్రోత్సహిస్తున్నాడని గుర్తించినట్లు పేర్కొంది. ఇతను సన్నీ టొరంటోగా పేరు మార్చుకున్నట్లు ఎన్​ ఐఏ వెల్లడించింది. 

ఇప్పటికే పలు ఆధారాలను బట్టబయలు చేస్తున్న భారత చర్యలతో కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో పీఠం కదులుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్​ మరో ఉగ్రవాది రహాస్యాన్ని మీడియాతో పంచుకుంది.