వచ్చేది మోదీ ప్రభుత్వమే: కిషన్​ రెడ్డి

Union Minister Kishan Reddy said that Modi government will come again at the Centre

Apr 29, 2024 - 16:25
 0
వచ్చేది మోదీ ప్రభుత్వమే: కిషన్​ రెడ్డి
  •  కమలం గుర్తుకు ఓటు వేయండి: కిషన్​ రెడ్డి

  •  ఇంటింటి ప్రచారంలో కేంద్ర మంత్రి

    నా తెలంగాణ, హైదరాబాద్​: కేంద్రంలో మరోసారి మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి అన్నారు. గెలిచే పార్టీకి ప్రజలు ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ మేరకు సోమవారం సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ఉదయం రైల్వే వర్క్ షాప్ లాలాగూడ ప్రాంతంలో పర్యటించి గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజలకు వివరించి కమలం పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్, జవహర్ నగర్ లో కేంద్ర మంత్రి పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటి తలుపుతట్టి సికింద్రాబాద్​ ఎంపీగా తనను మరోసారి ఆశీర్వదించాలని, మోదీ నాయకత్వంలో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డికి ఆయా కాలనీల ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. 



    దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం

    అనంతరం సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగురాలు తన సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కిషన్​ రెడ్డి అప్పటికప్పుడు సంబంధిత అధికారితో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల ఆత్మ గౌరవం కోసం మోదీ ప్రభుత్వం గత పదేండ్లు చేసిన కృషిని వివరించారు. రాష్ట్రంలో అటు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు దివ్యాంగుల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. మోదీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.