హమాస్​ పై ఐడీఎఫ్​ భారీ దాడి వీడియో విడుదల

Video release of IDF heavy attack on Hamas

Apr 27, 2024 - 17:08
 0
హమాస్​ పై ఐడీఎఫ్​ భారీ దాడి వీడియో విడుదల

జేరుసలెం: భారీ దాడికి సన్నాహాలు చేస్తున్న హమాస్​ ఉగ్రవాదులపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్స్​) భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులో సమావేశమైన వారందరూ మృతిచెందినట్లుగా ఐడీఎఫ్​ పేర్కొంది. కాగా ఈ దాడి ఎప్పుడు చేశామన్నది చెప్పలేదు. శనివారం సామాజిక మాధ్యమం వేదికగా వీడియోను విడుదల చేసింది. ఇజ్రాయెల్​ పై దాడికి సిద్దమవుతున్న హమాస్​ లాంచ్​ ప్యాడ్​ ను కూడా గుర్తించినట్లు తెలిపింది. నిమిషం ఆలస్యం చేయకుండా దాడి చేశామని వెల్లడించింది. 

అయితే ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఈ దాడి పెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడిలో అనేకమంది హమాస్​ ఉగ్రవాదులు చనిపోయినట్లు పేర్కొన్నారు. 

'యిఫ్తా' బ్రిగేడ్ (679) పోరాట బృందానికి చెందిన బలగాలు గాజా స్ట్రిప్ మధ్యలో ఉన్న సైనిక భవనం నుంచి ఇజ్రాయెల్ దళాలపై కాల్పులకు సిద్ధమవుతున్ విషయాన్ని ఐడీఎఫ్​ గుర్తించింది. దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మృతిచెందారన్న విషయం స్పష్టం కాకపోయినప్పటికీ దాడి సందర్భంగా ఒక వాహనంలోని 8మంది, బాంబుదాడిలో మరింత మంత్రి ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు గాజా స్ట్రిప్‌లో ఐడీఎఫ్​ ఆపరేషన్​ కొనసాగుతుంది.