బెంగళూరు పేలుడు ఇద్దరు అరెస్టు

బెంగుళూరు, తెలంగాణ, కేరళ పోలీసుల సంయుక్త ఆపరేషన్​ విజయవంతం వివరాలు వెల్లడించిన ఎన్​ ఐఏ అధికారులు ఐసీస్​ తో సంబంధాలపై ఆరా

Apr 12, 2024 - 12:58
 0
బెంగళూరు పేలుడు ఇద్దరు అరెస్టు

బెంగళూరు: ఎట్టకేలకు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్​ పేలుడు ప్రధాన సూత్రధారి సహా నిందితులను ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎన్​ఐఏ బెంగుళూరు, తెలంగాణ, కేరళ పోలీసుల సంయుక్త ఆపరేషన్​ ద్వారా కోల్​ కతా నుంచి నిందితులను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఇప్పటికే రూ. 10 లక్షల రివార్డును ఎన్​ ఐఏ ప్రకటించింది. మార్చి 1న పేలుడుకు పాల్పడింది ఈ ఇద్దరు నిందితులేనని అధికారులు వెల్లడించారు. 

ముసావిర్​ హుస్సేన్​ కాగా, మరో నిందితుడు అబ్దుల్​ మతిన అహ్మద్​ తాహాలని ఎన్​ఐఏ అధికారులు తెలిపారు. వీరిద్దరు పశ్చిమ బెంగాల్​ కోల్​ కతాలో దాగినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద ఐఈడీ ఎక్కడిదనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా కేఫ్​ లో బాంబు పెట్టింది షాజీబ్​ గా గుర్తించామన్నారు. ప్రధాన సూత్రధారి తాహా అన్నారు. 

నిందితులు తప్పుడు ధృవీకరణలతో కోల్​ కతాలో తలదాచుకున్నారని తెలిపారు. సంయుక్త ఆపరేషన్​ వల్లే వీరిని పట్టుకోగలిగామని మూడు రాష్ర్టాల పోలీసులకు ఎన్​ఐఏ కృతజ్ఞతలు తెలిపింది. నిందితులను కోర్టు హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్​ పిటిషన్​ వేస్తామని ఎన్​ ఐఏ వెల్లడించింది.

మరోవైపు వీరికి ఐసీస్​ తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలపై కూడా విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.