పాక్ కు ట్రంప్ చావుదెబ్బ
Trump's death blow to Pakistan
శరణార్థుల రాకకు అమెరికా నో
ప్రధాని షహబాజ్ షరీఫ్ పై దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు
పాక్ ఆఫ్ఘాన్ శరణార్థులపై వీడని పీఠముడి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: డోనాల్డ్ ట్రంప్ పాక్ ను తేరుకోలేని చావుదెబ్బ కొట్టాడు. అసలు ఆర్థిక కష్టాలను దిగమింగుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచదేశాలకు తామేమీ తీసిపోమని చెబుతున్న పాక్ ఈ దెబ్బతో పూర్తి ఆర్థిక అగాధంలో కూరుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది పౌరసత్వం రద్దు ఒకటైతే, రెండోది శరణార్థులను తమ దేశంలోకి అడుగుపెట్టనీయమన్నాడు. ఇక ముచ్చటగా మూడో నిర్ణయం ఉగ్రదేశాలకు అమెరికా ఫండింగ్ (ఆర్థిక సహాయం) నిలిపివేస్తుందన్నాడు.
ట్రంప్ నిర్ణయాలతో ఇప్పటికే పాక్ లో ఆర్థిక సంక్షోభం మొదలైంది. మరోసారి ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు కొనుక్కుతినే పరిస్థితులు లేవు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పాక్ వద్ద ఉన్న ప్రభుత్వ ఆస్తుల తనఖాకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
జో బైడెన్ పదవీ కాలంలో పాక్ లో చిక్కుకున్న ఆఫ్ఘన్ శరణార్థులు అమెరికాలో స్థిరపడేందుకు ఒకే చెప్పారు. ఇందుకు ఇరుదేశాల మధ్య చర్చలు కూడా కొలిక్కి వచ్చి అమలే తరువాయి అనే దశకు చేరుకుంది. దీంతో పాక్ శరణార్థులకు అమెరికా ఆశ్రయం కల్పిస్తుందని ప్రకటించి గొప్పలకు పోయింది. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు పాక్ ప్రధాని కాళ్ల కిందకు నీళ్లు ఉరేలా చేస్తుంది. అంత పొడవు, ఇంత పొడవు అని చెప్పుకున్న ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్ నిర్ణయంతో ఉలిక్కిపడ్డాడని ప్రధాని మాట ఉత్తదేనని మరోసారి ఋజువైందని పాక్ రాజకీయ, ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం 25వేల మంది ఆఫ్ఘన్ శరణార్థుల విషయం అమెరికా పరిష్కరించాలని పాక్ ఎదురుచూపులు చూస్తున్నది.
బైడెన్ ప్రభుత్వం 1600మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో ఎక్కువమంది యూఎస్ సైన్యంలో పని చేసిన ఆఫ్ఘాన్ కు చెందినవారున్నారు. ట్రంప్ నిర్ణయంతో విమాన టిక్కెట్లను కూడా తీసుకున్న వీరంతా ప్రస్తుతం టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. శరణార్థుల విషయంలో అమెరికా కఠినంగానే వ్యవహరిస్తుందని యూఎస్ ఆర్మీకి చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు చొరబాట్లను కూడా కట్టడి చేయాలని తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయన్నారు. ఇంతకుమించి తాము ఏం మాట్లాడలేమన్నారు.
అయితే శరణార్థుల విషయంలో పాక్ తో మరోసారి ట్రంప్ ప్రభుత్వం చర్చలు జరుపుతుందా? జరపదా అనేది తెలియాల్సి ఉంది.