ఫిబ్రవరి 1 బుల్ అండ్ బేర్ ల వార్!
February 1 bull and bear war!
స్టాక్ మార్కెట్లు ఎగిసిపడేనా?
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: సాధారణ బడ్జెట్ కు ముందు గత పదేళ్లలో స్టాక్ మార్కెట్లు పలుమార్లు ఉవ్వెత్తున ఎగిసిపడగా, పలుమార్లు నేలచూపులు చూశాయి. బుల్ అండ్ బేర్ ల వార్ కొనసాగి సమమైంది. పదేళ్ల బడ్జెట్ కు ముందు ఐదుసార్లు మార్కెట్లు లాభాలను చవి చూడగా, ఐదుసార్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 2021లో స్టాక్ మార్కెట్ ఐదు శాతం పడిపోగా, 2020లో 2.43 శాతం పడిపోయింది. 2024లో తొలుత భారీగా పడిపోయిన చివరి సెషన్ లో మార్కెట్లు ఉవ్వెత్తున ఎగిసిపడి నష్టాలను రికవరీ చేసి స్వల్ప నష్టాలను చవిచూశాయి. 2023లో లాభాలతో ముగిశాయి. 2016న నష్టాలను చవిచూడగా, 2017లో లాభాలు, 2018లో నష్టాలు, 2019లో నష్టాలను చవిచూసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో ఈసారి స్టాక్ మార్కెట్లో బుల్ అండ్ బేర్ ల మధ్య పోటీ ఎలా ఉండనుందోననే సందేహాలు నెలకొన్నాయి. దేశీయ ఇన్వెస్టర్లలో బుల్ హావా కొనసాగాలని భావిస్తుండగా, విదేశీ ఇన్వెస్టర్లలో పలువురు బలపడాలని, పలువురు బేర్ తప్పదనే జోస్యం చెబుతున్నారు. అయితే భారత మార్కెట్లపై అమెరికా, చైనాతోపాటు వివిధ దేశాల కన్ను పడింది. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ అందించే ఉద్దీపైనే ఆధారపడి క్రయ విక్రయాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. వీరి క్రయ విక్రయాలు భారత మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నా, ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక పటిష్ఠ విధానాలు తిరిగి పుంజుకోవడంలో ఎక్కువ సమయం తీసుకోవనే వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి మార్కెట్లలో బుల్ అండ్ బేర్ ల వార్ ను చూడొచ్చు.