మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు

Sri Lankan Navy firing on fishermen

Jan 28, 2025 - 18:22
 0
మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు

ఇద్దరి పరిస్థితి విషమం, ముగ్గురికి గాయాలు
తీవ్ర అభ్యంతరం తెలిపిన రణధీర్​ జై స్వాల్​
బలప్రయోగం సరికాదు..ఒప్పందాలకు కట్టుబడాల్సిందే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతీయ మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ శ్రీలంక హై కమిషనర్​ ను పిలిపించి మంగళవారం నిరసనను వ్యక్తం చేశారు. పరిస్థితులను వెంటనే చక్కదిద్దే ప్రయత్నాలను చేపట్టాలన్నారు. మత్స్యకారులను క్షేమంగా వెనక్కు పంపాలన్నారు. మంగళవారం ఉదయం డెల్ఫ్ట ద్వీపం సమీపంలో భారత్​ కు చెందిన 13మంది మత్సకారులను శ్రీలంక నేవి పట్టుకుంది. పట్టుకునే ముందే వీరిపై కాల్పులకు పాల్పడింది. దీంతో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జాఫ్నాలోని బోధనా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. శ్రీలంకలోని భారత రాయబారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారులను కలిశారు. వారికి అందుతున్న చికిత్సపై వైద్యులతో సంప్రదింపులు జరిపి భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి సమాచారం అందజేశారు. దీంతో స్పందించిన ప్రతినిధి రణధీర్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవనోపాధి కోసం పోరాడుతున్న మత్స్యకారులపై కాల్పులు సరికాదన్నారు. వీరి పట్ల మానవీయ కోణంలో ఆలోచించే అవసరం ఉందన్నారు. బలప్రయోగం సరికాదన్నారు. ఈ విషయంలో ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య ఉన్న ఒప్పందాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ప్రతినిధి రణధీర్​ జై స్వాల్​ స్పష్టం చేశారు.