జర్నలిస్టు సత్యనారాయణ మృతి.. టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
Journalist Satyanarayana's death..TWJF mourns
నా తెలంగాణ, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ అకాల మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రగాఢ సంతాపం తెలియజేసింది. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో దశబ్దాల పాటు జర్నలిస్టుల సమస్యలపై మెతుకు సీమ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో సత్యనారాయణ పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్యలు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు ఆయన అందించిన సహకారం మరచిపోలేనిదని, మెతుకుసీమ ప్రజల కన్నీటి గోసపై వార్త పత్రికల్లో ఆయన రాసిన వరుస కథనాలు నేటికి జిల్లాలో చర్చనీయాంశమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరేండ్ల ఎమ్మెల్సీ పదవిని, ఆరు నెలల కాలంలోనే త్యాగం చేసిన ఘనత సత్యనారాయణకే దక్కిందని అన్నారు. సత్యనారాయణ మరణం జర్నలిస్టులకు, సామాన్య ప్రజలకు తీరని లోటన్నారు.