సీపీఎస్​ వద్దు.. ఓపీఎస్​ అమలు చేయాలి

మొయినాబాద్​ పీఆర్​ టీయుటీఎస్​ డిమాండ్​

Jan 27, 2025 - 17:24
Jan 27, 2025 - 17:37
 0
సీపీఎస్​ వద్దు.. ఓపీఎస్​ అమలు చేయాలి

నా తెలంగాణ, మొయినాబాద్​: సీపీఎస్ (కాంట్రీబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​)​ రద్దు చేసి ఓపీఎస్​ (ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​)ను అమలు చేయాలని మొయినాబాద్​ మండల పీఆర్​ టీయుటీఎస్​  అధ్యక్షులు జక్కని బందయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి నరేందర్​ రెడ్డిలు డిమాండ్​ చేశారు. సోమవారం పీఆర్​ టీయుటీఎస్​ కు చెందిన ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వం యూపీఎస్​ పై విడుదల చేసిన గెజిట్​ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పీఆర్​ టీయుటీఎస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మొయినాబాద్​ తహశీల్దార్​ వినోద్​ కుమార్​ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 30 నుంచి 35 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​ అందించాలని డిమాండ్​ చేశారు. ఇది వారి ప్రాథమిక హక్కుగా అభివర్ణించారు. ఉపాధ్యాయులందరూ పాత పెన్షన్​ విధానం అమలు చేయాలని నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోకుండా యూపీఎస్​ ను తీసుకురావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్​ రద్దు, ఓపీఎస్​ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. 

ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన వారిలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, లక్ష్మన్​, శివ కుమార్, నారాయణ, బీమ్లా, మహమూద్, శంకర్, వినోద్ కుమార్, రాములు, హుసేన్, రాములు, సిద్ధం శ్రీనివాస్, మహేందర్, విజయ్ బాయ్, రజినీ, లావణ్య, కైజర్ అహమ్మద్, మౌనేశ్వర, వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.