ప్రజా అవార్డులుగా మార్చిన ఘనత బీజేపీదే

BJP has the credit of converting it into public awards

Jan 28, 2025 - 17:03
 0
ప్రజా అవార్డులుగా మార్చిన ఘనత బీజేపీదే

బీజేపీ రాష్ర్ట కార్యదర్శి డా. ఎస్​. ప్రకాష్​ రెడ్డి
సీఎం రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్​ ఎటాక్​

నా తెలంగాణ, హైదరాబాద్​: అవార్డులు 2014 కంటే ముందు మంత్రుల సిఫార్సులపైనే ఆధారపడి ఉండేవని, కానీ ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక ప్రజా అవార్డులుగా తీర్చిదిద్దారని బీజేపీ రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి అన్నారు. అవార్డుల ఎంపికపై సీఎం రేవంత్​ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. మంగళవారం ప్రకాష్​ రెడ్డి బీజేపీ రాష్​ర్ట కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశేష రంగాల్లో సేవలందించిన తెలుగు వారికి కూడా పద్మ​ అవార్డులు దక్కడం గర్వకారణమని, అభినందనలు తెలిపారు. అవార్డుల కోసం 56 మందితో స్వతంత్ర కమిటీ ఏర్పాటు, ఆన్​ లైన్​ లో దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం అవార్డుకు ఎంపిక చేస్తారని తెలిపారు. తెలంగాణ నుంచి 300మందికిపైగా అవార్డుల కోసం దరఖాస్తులు చేశారన్నారు. సీఎం మాత్రం ఐదుగురి పేర్లను మాత్రమే ప్రతిపాదించామని చెబుతున్నారు. మిగతా వారు పద్మ అవార్డులకు అర్హులు కాదా? అని నిలదీశారు. రేవంత్​ రెడ్డి అహంకార పూరిత మాటలు సరికాదన్నారు. తాము అందరినీ గౌరవిస్తామన్నారు. రేవంత్​ విమర్శలకు బండి సంజయ్​ సమాధానం ఇస్తే వాటిపై విమర్శలెందుకని నిలదీశారు. తెలంగాణలోనూ కులాలు, ఉపకులాల వివాదానికి తెరలేపి ప్రజలను విడగొట్టాలనే రాజకీయ క్రీడకు తెరలేపారని ప్రకాష్​ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప తదితరులు పాల్గొన్నారు.