ఉత్తరాఖండ్​ లో లోకల్​ బాడీ ఎన్నికలు

ఉత్సాహంగా పాల్గొంటున్న ఓటర్లు

Jan 23, 2025 - 14:08
 0
ఉత్తరాఖండ్​ లో లోకల్​ బాడీ ఎన్నికలు

డెహ్రాడూన్​: ఉత్తరాఖండ్​ లో గురువారం జరుగుతున్న లోకల్​ బాడీ ఎన్నికలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఉదయం నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. యువకులు, యువతులు, వృద్ధులు, దివ్యాంగులు ఓటింగ్​ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్​ లోని వంద మునిసిపల్​ బాడీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 30లక్షల మందికి పైగా ఓటర్లు ఐదు వేల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.  రాష్ర్టంలో మొత్తం 1,516 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 592 సున్నితమైన మరియు 412 అతిసున్నిత పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.   పోలింగ్ కేంద్రాల వద్ద 18 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పోలీసులు 185 చెకింగ్ బ్యారియర్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 117 సమస్యాత్మాక ప్రాంతాలను కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.