ఆరేళ్లలో ట్రిపుల్​ అభివృద్ధి

అడ్వాంటేజ్​ అసోం 2.0 సమ్మిట్​ లో ప్రధాని మోదీ

Feb 25, 2025 - 14:51
 0
ఆరేళ్లలో ట్రిపుల్​ అభివృద్ధి

అసోం అభివృద్ధిని ప్రపంచంతో అనుసంధానిస్తాం
2018లో రూ. 2.75 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి రూ. 6 లక్షల కోట్లకు బడ్జెట్​

డీస్ఫూర్​: ఈశాన్య ప్రాంతాలు దేశ భవిష్యత్తును మార్చే శక్తియుక్తులు కలిగి ఉన్నాయని అసోం అభివృద్ధిని ప్రపంచంతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం అసోం పర్యటనలో ఉన్న మోదీ గౌహాతిలో జరిగిన అడ్వాంటేజ్​ అసోం 2.0 ఇన్వెస్ట్​ మెంట్​ అండ్​ ఇన్​ ఫ్​రాస్ర్టక్చర్​ సమ్మిట్​ 2025లో ప్రసంగించారు. ఆరేళ్లలో అసోం ఆర్థిక వ్యవస్థ డబుల్ అయ్యిందన్నారు. ఈశాన్య ప్రాంతం వృద్ధిలో అసోం కీలక భూమిక పోషిస్తుందన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న అవకాశాలతో అసోంను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని చెప్పారు.

స్వేచ్ఛా వాణిజ్యంతో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి..
ఈ వేదిక భవిష్యత్​ లో అసోం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసోం ఆర్థిక వ్యవస్థ 2018లో రూ. 2.75 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి రూ. 6 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది డబుల్​ కాదు.. ట్రిపుల్​ ఇంజన్​ వేగంతో దూసుకుపోతుందని కితాబిచ్చారు. వ్యాపార, వాణిజ్యాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ప్రాముఖ్యత అసోం అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కేంద్రం రూపొందించిన స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాలతో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించామన్నారు. దీంతో ఆసియాలో ఈశాన్య ప్రాంతాల వ్యాపార, వాణిజ్య బంధాలు మరింత బలోపేతం దిశగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు. దీంతో భారత్​–మధ్యప్రాచ్యం–యూరప్​ ఆర్థిక కారిడార్​ లో నూతన అవకాశాలు సృష్​టించగలుగుతున్నామని చెప్పారు. 
 
పురోగతిలో భారత్​ కీలక చోదక శక్తి..
సంస్థాగత సంస్కరణలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు భారతదేశ పురోగతికి కీలకమైన చోదక శక్తి అని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు భారతదేశ వృద్ధిలో సామర్థ్యాన్ని చూస్తూ.. అసోం డబుల్ ఇంజిన్ వేగంతో ముందుకు సాగుతోంతుందని మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  2009నుంచి 2014 మధ్య అసోం రైల్వే బడ్జెట్​ సంవత్సరానికి సగటున రూ. 2,100 కోట్లుగా ఉందని, 2024కు వచ్చేసరికి ఆ బడ్జెట్​ ఏటా రూ. 10వేల కోట్లకు పెరిగిందన్నారు. అడ్వాంటేజ్​ అసోం 2.0 సమ్మిట్​ ద్వారా పారిశ్రామిక, మౌలికసదుపాయాల రంగాలలో అనేక అవకాశాలు ఏర్పడతాయని, పెట్టుబడులకు మంచి వేదికగా నిలుస్తుందని కేంద్రం అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.