కల్వకుంట్ల శైలిమ బాగా రిచ్!
Kalvakuntla Shailima is very rich!

నా తెలంగాణ, హైదరాబాద్: కల్వకుంట్ల వారి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉన్న వివరాల ప్రకారం అనేక సంస్థల్లో కల్వకుంట్ల శైలిమ (కేటీఆర్ సతీమణి) అనుబంధ డైరెక్టర్ గా ఉన్నారు. మంత్రిత్వశాఖలో రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ 06641004గా నమోదైంది. కల్వకుంట్ల శైలిమ తొమ్మిది సంస్థల్లో అనుబంధంగా ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఉంది. 2014 కంటే ముందు ఆమె వద్ద ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కేసీఆర్ సీఎం అయ్యాక శైలిమ ఇంతపెద్ద ఎత్తున పలు సంస్థల్లో డైరెక్టర్ గా, పార్టనర్ షిప్ గా ఉండడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉందనే అనుమానాలు, బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్ గా, పలు హోదాల్లో కొనసాగుతున్న సంస్థలు..
అథోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా 2021 నవంబర్ 26 నుంచి కొనసాగుతున్నారు.
జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా 2015 నవంబర్ 03 నుంచి కొనసాగుతున్నారు.
సద్గురు సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ లో 2018 ఏప్రిల్ 24 నుంచి భాగస్వామి (పార్టనర్)గా కొనసాగుతున్నారు.
అరుష్ బ్రీడింగ్ ఫామ్స్ లో 2019 మే 16 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు.
అలేఖ్య వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా 2014 సెప్టెంబర్ 30 నుంచి కొనసాగుతున్నారు.
తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అడిషనల్ డైరెక్టర్ గా 2014 జూలై 29 నుంచి కొనసాగుతున్నారు.
తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా 2014 సెప్టెంబర్ 29 నుంచి కొనసాగుతున్నారు.
అథోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో అడిషనల్ డైరెక్టర్ గా 2021 మార్చి 05 నుంచి కొనసాగుతున్నారు.
షార్ప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా 2015 ఆగస్ట్ 17 నుంచి కొనసాగుతునారు.