మద్యం ప్రియులకు షాక్​ 15 శాతం బీర్ల ధరలు పెంపు

15 percent hike in beer prices is a shock for liquor lovers

Feb 11, 2025 - 16:05
 0
మద్యం ప్రియులకు షాక్​ 15 శాతం బీర్ల ధరలు పెంపు

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణలో బీర్​ (మద్యం) ప్రియులకు షాక్​ తగిలింది. 15 శాతం ధరల పెంపు మంగళవారం నుంచి అమల్లోకొచ్చాయి. నూతన ఎక్సైజ్​ విధానం ప్రకారం బీర్​ ధరల పెంపును గతంలోనే ప్రభుత్వం ప్రకటించినా అందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం అర్థరాత్రి ప్రభుత్వం జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి ధరలు పెరిగాయి. ఉత్తర్వుల ప్రకారం 650 మి.లీ. బీరు బాటిల్​ ధర రూ. 170 నుంచి రూ. 180 ఉండనుంది. బ్రాండ్​ ను బట్టి ధర ఉండనుంది. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఎస్​.ఎ.ఎం. ధరల కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను రిజ్వీ ఆదేశించారు. రిటైర్డ్ జస్టిస్ జైస్వాల్ నేతృత్వంలోని ప్యానెల్ బీర్ ధరలను 15 శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీనిని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో మంగళవారం నుంచి సవరించిన ధరల ప్రకారం బీర్​ ల ధరలు పెరిగాయి. బీర్ల ఉత్పత్తి వ్యయం పెరగడంపై 2019లోనే బీఎఐ (బ్రూవర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఎంతకూ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇటీవలే కొంతకాలం బీర్ల సరఫరాను కూడా నిలిపివేసింది. యూనైటెడ్​ బ్రూవరీస్​ 70 శాతం వాటా తెలంగాణ మద్యం మార్కెట్​ నుంచే లభించడం గమనార్హం. ప్రపంచంలోనే మద్యం అగ్రశ్రేణి మార్కెట్​ లలో భారత్​ నిలుస్తుంది.