9మంది నక్సలైట్ల లొంగుబాటు
Surrender of 9 Naxalites

నా తెలంగాణ, ములుగు: తెలంగాణ ములుగు జిల్లాల్లో చత్తీస్ గఢ్ కు చెందిన 9మంది నక్సలైట్ లు ఆదివారం లొంగిపోయారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత ద్వారా మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయించినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. లొంగిపోయిన వారిలో మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. వీరంతా ఒకే కేడర్ కు చెందిన వారిగా సమాచారం. ప్రశాంత జీవితం కోసం స్వచ్ఛందంగా లొంగిపోయిందని అధికారులు వివరించారు. కాగా లొంగిపోయిన నక్సలైట్లు ఏ ప్రాంతానికి చెందిన వారు తదితర వివరాలను అధికారులు ప్రకటించలేదు.