ఒక రోజు ఆప్ నేతల సస్పెండ్ ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక
One day suspension of AAP leaders in Delhi assembly CAG report

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గందరగోళం నడుమ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆప్ పార్టీ నేతలు ఉదయం నుంచే అసెంబ్లీలో నిరసనలు చేస్తూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్పీకర్ విజయేందర్ గుప్తా అతిషి సహా 13 మంది ఎమ్మెల్యేలను సమావేశాలను నుంచి ఒక్కరోజు కోసం సస్పెండ్ చేశారు. దీంతో అసెంబ్లీ బయటే ఆప్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆప్ అనుసరించిన తప్పుడు మద్యం విధానాల వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2,026 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. కాగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆయుష్మాన్ భవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
కాగ్ నివేదికలో ఏముంది..
– 2021 మార్చి ఆర్థిక శాఖ ఆడిటింగ్ రిపోర్టు సమర్పించలేదు.
– 2020, 2021 రెవెన్యూ, ఎకానమీ, సోషల్, జనరల్ సెక్టార్, పీఎస్ యూ రిపోర్టులను సమర్పించలేదు.
– 2022 ఆడిటింగ్ సమర్పించలేదు.
– మద్యం కేటాయింపులపై ఆడిటింగ్ రిపోర్టు సమర్పించలేదు.
– 2023 ఆర్థిక శాఖ ఆడిటింగ్ రిపోర్టు సమర్పించలేదు.
– పబ్లిక్ హెల్త్, ఇన్ ఫ్రాస్ర్టక్చర్, ఆరోగ్య సేవలు, మేనేజ్ మెంట్ వంటి ఆడిటింగ్ రిపోర్టు సమర్పించలేదు.
ఇంకా అనేక విషయాలపై ఆప్ ప్రభుత్వ పాలనను కాగ్ ఈ నివేదికలో ఎండగట్టింది.