మహారాష్ట్ర ఉద్యోగుల డీఏ పెంపు!

DA increase of Maharashtra employees!

Feb 25, 2025 - 18:43
 0
మహారాష్ట్ర ఉద్యోగుల డీఏ పెంపు!

ముంబాయి: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురందించింది. డీఏ భత్యం 12 శాతం పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల సారాంశాన్ని ఆర్థిక శాఖ అధికారి మీడియాకు వివరించారు. డీఏ పెంపు వల్ల 17 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. కరవు భత్యం పంపిణీ విధానాలు, నిబంధనలు భవిష్యత్తులోనూ వర్తిస్తాయన్నారు. పెంపు 2024 జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. ఐదవ వేతన సంఘం ప్రకారం కరవు భత్యం పెంచారని పేర్కొన్నారు. దీంతో 443 శాతం నుంచి 455 శాతానికి సవరించిన డీఏ పెరిగిందన్నారు. 2025 ఫిబ్రవరి వేతనంతో కరవు భత్యం బకాయిలన్నీ ఒకేసారి చెల్లించబడతాయని పేర్కొన్నారు. డీఏ ఖర్చును వేతనాల బడ్జెట్​ నుంచి కేటాయిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.