పెరుగుతున్న మూహూర్తపు ప్రసవాలు
Increasing preterm births

ఎన్ఎఫ్ హెచ్ ఎస్ డేటాలో వెల్లడి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: తెలుగు రాష్ర్టాల్లో మూహూర్తపు డెలివరీ ట్రండ్ రోజురోజుకు పెరుగుతుంది. పలానా రోజు మంచిది అని ముందే నిర్ణయించుకొని ప్రసవానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజు కూడా పెద్ద ఎత్తున ప్రసవాలకు డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని ట్రంప్ నూతన చట్టంతో జడుసుకొని ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే ప్రసవాలకు సిద్ధమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కొనసాగుతున్నా, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఈ తరహా ప్రసవాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న 25 శాతం ప్రసవాలు ముందే నిర్ణయించుకున్న తేదీ, సమయంలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ ఎస్) డేటా ప్రకారం 2015–16లో ఈ రకమైన ప్రసవాలు 17.2 శాతం, 2019–21 వరకు 21.5 శాతం నమోదయ్యాయి. అయితే ఈ తరహా ప్రసవాల్లో తల్లీ, బిడ్డల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని, అందుకే ఇలాంటి మూహూర్తపు ప్రసవాలకు దూరంగానే ఉంటే బాగుంటుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సూచిస్తుంది.
ప్రమాదం లేకుంటే ఓకే..
కాగా ఈ తరహా ప్రసవాలతో గర్భీణులకు ప్రమాదం లేదా అంటే లేదనే అంటున్నారు గైనకాలజిస్ట్ వైద్యులు. ముందుగా గర్భినీ స్ర్తీ వయస్సు, ప్రసవ సమయం, అత్యవసర పరిస్థితులు తలెత్తవనుకుంటేనే వారి కోరికను ఒప్పుకుంటామని చెబుతున్నారు. జ్యోతిష్కులను, పూజారులను, దేశంలో ఏదైనా ముఖ్యమైన మూహుర్తం, సంఘటన రోజు ప్రసవాలు జరగాలని చాలామంది భావిస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా ప్రసవాల్లో ప్రమాదం లేకుంటేనే ఒప్పుకుంటామని, లేకుంటే ఆ రకం ప్రసవాలకు నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రకమైన ప్రసవాల్లో తొలిసారి ప్రసవాలే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో సాంప్రదాయకంగా ప్రసవాలు కూడా పెరుగుతున్నాయి. బిడ్డ ఎప్పుడు పుడతారని వైద్యులు చెప్పినా, ఆ తరువాత కానీ, ముందే గానీ ప్రసవాలు చేయాలనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రులు, తోబుట్టువులు నిర్ణయించి ఇలాంటి ప్రసవాలకు ముందుకు వెళుతున్నారు.
బ్రహ్మమూహూర్తంలో ప్రసవాలకు వైద్యుల కొరత..
హైదరాబాద్ మహానగరంలో కూడా ఈ తరహా ప్రసవాలకు భారీ డిమాండ్ ఉందన్నారు. ఒక్కోసారి అయితే మంచి మూహుర్తం రోజున బయటి నుంచి గైనకాలజిస్టులను పిలుచుకొని ఒకేసమయంలో ప్రసవాలకు ఉపక్రమిస్తున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ప్రముఖ ఆసుపత్రి వైద్యురాలు చెప్పడం విశేషం. అయితే ఈ తరహా ప్రసవాలు పూర్తి పరిణితి ఉన్న వైద్యులు మాత్రమే చేయగలరని, అదీ గర్భిణీ ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉండే వైద్యులైతే మరింత విజయవంతంగా ప్రసవాల రేటు ఉంటుందని తెలిపారు. నార్మల్, సిజేరియన్ డెలివరీలన్నది ముందుగా వైద్యుల ప్రాథమికత నార్మల్ ప్రసవానికి ఉంటుందన్నారు. పలు రకాల ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యా సిజేరియన్ లు తప్పడం లేదన్నారు. అదే సమయంలో సిజేరియన్ ద్వారానే సదరు గర్భిణీ స్ర్తీకి బిడ్డ పుడతారని పూర్తి నిర్ధారణ అనంతరమే ఈ రకమైన మూహూర్తపు ప్రసవాలకు ఆస్కారం ఉంటుందన్నారు.
బిడ్డ భవిష్యత్ తల్లిదండ్రులే రాసుకుంటున్నారా?..
ఇలాంటి డెలివరీలు ఎంతమాత్రం గర్భిణీ స్ర్తీలకు మంచివి కావని, భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేవంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ముందుగా తాము మూహూర్తపు డెలివరీలను ప్రోత్సహించమని తిరస్కరిస్తామన్నారు. అయినా ఆసక్తిని ప్రదర్శించిన వారి పూర్తి హెల్త్ చెకప్ తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలామంది బ్రహ్మమూహూర్తంలో వేకువజామున 3 గంటలకు డెలివరీలో చేయాలనే డిమాండ్ కూడా ఉంటుందని, అలాంటప్పుడు వైద్యులు అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల ప్రసావాలకు అనుకూలంగా ఉండడం లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇతర ఆసుపత్రుల్లోని స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి ప్రసవాలకు ఉపక్రమిస్తామన్నారు. ఏది ఏదైతేనేం సమయానికి ముందే, తరువాతో శుభమూహూర్తాన బిడ్డ కెవ్వు కేక విని భవిష్యత్ ను ముందే తామే రాసుకున్నట్లు సంతోషపడిపోతున్నారు తల్లిదండ్రులు.