క్విట్ ఇండియా స్ఫూర్తి.. అవినీతిని తరిమికొట్టే నూతనోద్యమానికి ప్రధాని పిలుపు
The spirit of Quit India.. Prime Minister calls for innovation to drive away corruption
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నాటి క్విట్ ఇండియా స్ఫూర్తితో అవినీతి, కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలను తరిమికొట్టే నూతన ఉద్యమానికి పిలుపునిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం నాటికి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమానికి 82 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వలస పాలన నుంచి విముక్తి కోసం మహాత్మాగాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమానికి అంకురార్పణ జరగడం ఆంగ్లేయులకు దడ పుట్టించిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఉద్యమం ముఖ్యమైన పాత్రను పోషించిందన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం వల్ల బ్రిటిష్ వారు దేశం నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనకు బలం చేకూర్చిందన్నారు. ఈ ఉద్యమంలో అనేకమంది హింసకు గురయ్యారని తెలిపారు. అయినా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని విజయవంతం చేశారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమం ముంబైలోని గ్వాలియా నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఆగస్ట్ ను విప్లవ దినంగా కూడా పేర్కొంటారు.