రైల్వే ట్రాక్ లపై దుశ్చర్యలు
బంగ్లాలో దాడులు, ఆర్థిక వేత్తలపై ఆరోపణలు
చైనా ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వాల తీరే కారణం
గత ప్రభుత్వం తీసుకున్న 35 శాతం రుణం చెల్లింపు
681 బిలియన్ డాలర్లకు విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుదల
దిగుమతుల్లో నాణ్యత, రాయితీలకే ప్రాధాన్యత నిస్తున్న మోదీ ప్రభుత్వం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
భారతదేశ ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బృహత్తర ప్రయత్నం జరుగుతుంటే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు దుష్టశక్తులు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల వరుసగా రైల్వే ట్రాక్ లపై జరుగుతున్న దాడులు, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి, సరిహద్దుల్లో దాడులు, ఇస్లామిక్ దేశాల నుంచి భారత్ చమురు కొనుగులుకు అడ్డంకులు ఇలాంటి పరిణామాలన్నీ చూస్తుంటే దేశంలో ఆర్థిక అస్థిరతతోపాటు మత ఘర్షణలకు కూడా ముష్కర మూకలు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయని ఇంటలిజెన్స్ పసిగట్టింది. ఇలాంటి కీలక సమయంలో ఈ ముష్కర మూకలకు ఊతం ఇచ్చేలా భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం శోచనీయం.
2014 కంటే ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ 1.7 ట్రిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం భారత జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. భారత్ లోని పలు బడా ఆర్థిక సంస్థలను నిర్వీర్యం చేసేలా దుష్టశక్తులతో కలిసి ఆరోపణలు, ప్రత్యారోపణలు, సెబీ విచారణ, సుప్రీం తీర్పులు, పలువురి మొట్టికాయలు తిన్నాక కూడా ఈ పార్టీల విధానపరమైన వైఖరిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవడం లేదు. భవిష్యత్లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీయే కారణమని ఆరోపిస్తోంది.
గత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం 35 శాతాన్ని 2014 తరువాత మోదీ ప్రభుత్వం చెల్లించడం విశేషం. భారీ రుణాలకు వడ్డీలు చెల్లింపులు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకంగా మారడాన్ని గమనించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దేశీయంగానే ఆయా వ్యవస్థలను బలోపేతం చేయడం ఉత్పత్తులు పెంచి ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ లోటును భర్తీ చేసుకుంటోంది. మోదీ తీసుకున్న ఈ చర్యలతో ప్రస్తుతం ప్రపంచ బ్యాంకుల్లో భారత్ కు రుణాన్ని ఇచ్చే సదుపాయం మరింత పెరిగింది. అడపా దడపా మోదీ ప్రభుత్వం కూడా రుణాలు తీసుకుంటున్నప్పటికీ తీసుకున్న రుణాల ద్వారానే చెల్లింపులు చేసేలా వ్యవస్థను మెరుగుపర్చడంతో సత్ఫలితాలను సాధించగలుగుతుంది.
అమెరికా, జపాన్, జర్మనీ తదితర దేశాలతో పోల్చుకుంటే భారత్ తీసుకున్న రుణాల పరిమితిని క్రమేణా ప్రతీయేటా తగ్గించగలుగుతుంది. యూపీఐ పే ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయడం కూడా భారత్ కు బాగా కలిసివస్తోంది. 2013లో 12.5 శాతం నుంచి 13 శాతం భారతీయుడిపై రుణభారం సగటు ఉండగా 2024 (ప్రస్తుతం) ఆ రుణరేటు 8.4 నుంచి 8.75కు తగ్గింది. ఇదే గాక ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. మౌలికసదుపాయాల కల్పన, కనెక్టివిటీ, డిజిటల్ విప్లవం, జీ–20 నిర్వహణ, రక్షణ రంగం బలోపేతం, పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి పెరుగుదల వంటి కీలక నిర్ణయాల్లో దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలను త్వరితగతిన తీసుకుంటోంది.
2011లో బాహ్య రుణం, జీడీపీ నిష్పత్తి 18.6 శాతం కాగా 20121 నాటిని 19 నుంచి 18.7 శాతంగా నమోదైంది. ప్రస్తుతం పదేళ్లుగా జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే ఇదేం పెద్ద భారం కాబోదని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రుణాలను తగ్గించుకునేందుకు మోదీ ప్రభుత్వం దివాలా చట్టాన్ని ఉపయోగించుకుంది. అదే సమయంలో అంతర్గత బ్యాంకు రుణాల రికవరీని పటిష్ఠం చేసింది. దీంతో 304 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 681 బిలియన్ డాలర్లకు పెంచుకుంది.
మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో కొనుగోళ్లు, దిగుమతులనే చెప్పాలి. ఆయా దిగుమతులపై భారీ రాయితీతో నే దిగుమతులను చేసుకుంటుంది. ఉదాహరణకు చూసుకుంటే ఇటీవల రష్యా ద్వారా భారీ ఎత్తున భారత్ చమురును కొంటోంది. దీంతో ఇస్లామిక్ కంట్రీల దిగుమతిని తగ్గించుకోగలిగింది. దీంతో దూరాభారమే గాక భారీ పొదుపు కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో భారత్ కు లభిస్తుంది. ఇటీవల బ్రూనైతో జరిగిన పలు ఒప్పందాల ద్వారా కూడా ఇలాంటి కొనుగోళ్లకే మొగ్గుచూపింది. త్వరలోనే బ్రూనైతో కూడా చమురును భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో ఆర్థికంగా భారీగా మిగులును నమోదు చేసుకుంటుంది.
దేశానికి స్వాతంత్ర్యం సమకూరాక ఎక్కువశాతం కాంగ్రెస్ ప్రభుత్వమే పాలించింది. వీరి అసమర్థ పాలన వల్ల చైనా గణనీయంగా ముందుకు దూసుకువెళితే కనీసం పాక్ కు కూడా బుద్ధి చెప్పుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండేది. మోదీ వచ్చాక ఆ తీరు పూర్తిగా మారిపోయింది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమంతోపాటు విదేశాంగ నీతి రూపురేఖలు, నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును పూర్తిగా కల్పించడంతో ఆర్థిక రంగ నిపుణులు తమ సత్తా చాటగలుగుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలలో ఈ స్వేచ్ఛ ఉండకపోవడం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయి అది చైనాకు బాగా లాభం చేకూర్చింది. ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పుల భారాన్నే మోదీ ప్రభుత్వం చెల్లిస్తూ రుణభారాన్ని గణనీయంగా తగ్గించగలుగుతోంది.
ఏది ఏమైనా ప్రపంచ సవాళ్లను, కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను, గ్లోబల్ వార్మింగ్ లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, శత్రు దేశాలకు తమదైన రీతిలో బుద్ధి చెబుతూ, ఇంటిదొంగల పనిపడుతూ మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలు మరోమారి తమ విశ్వాసాన్ని చాటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.