మేక్ ఇన్ ఇండియాతో ఏపీఐ దిగుమతుల్లో తగ్గుదల
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దిగుమతి చేసుకున్న ఏపీఐలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఆరవ సీఐఐ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ సమ్మిట్ లో డాక్టర్ జితేంద్ర సింగ్ ఫాల్గొని ప్రసంగించారు. దేశీయ తయారీని బలోపేతం చేయడం ద్వారా భారత్ స్వావలంభన దిశగా దూసుకువెళుతుందన్నారు. క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణలో ఫార్మా పరిశ్రమల పనితీరును అభినందించారు. నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరల్లో అందిస్తున్నారని అభినందించారు. ఫార్మా ఉత్పత్తి ప్రకారం మూడో స్థానంలో, విలువ ప్రకారం 14వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సినేషన్లను అందించే ప్రయత్నాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఇదే సమయంలో ఆయా వ్యాధులపై టీకాలు, సాంకేతిక బదిలీలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ పరిశ్రమలో కీలకమైన విభాగం ఏపీఐ అన్నారు. ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మోనాలజీ, నెఫ్రాలజీ, ఇతర అనేక విభాగాలలో వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారని మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.