తెలుగోళ్ల ‘ప్రేమలు’ గిట్లనే ఉంటాయి

మలయాళంలో ప్రేమలు సినిమాతో సౌత్ సెన్సేషన్ గా మారిన బ్యూటీ మమితా బైజు

Apr 23, 2024 - 15:11
 0
తెలుగోళ్ల ‘ప్రేమలు’ గిట్లనే ఉంటాయి

మలయాళంలో ప్రేమలు సినిమాతో సౌత్ సెన్సేషన్ గా మారిన బ్యూటీ మమితా బైజు. మలయాళ పరిశ్రమకు ఏడేళ్ల క్రితం పరిచయమైన మమితా అక్కడ 14 సినిమాల దాకా నటించినా రాని క్రేజ్ ఇమేజ్ ప్రేమలు సినిమాతో వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. మలయాళంలో వచ్చిన ఈ లవ్ స్టోరీ మూవీని తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా అభిమానించారు. ప్రేమలు సినిమా రిలీజ్ తర్వాత ఎక్కడ చూసినా మమితా బైజు కనిపిస్తుంది. -  అంతగా ఆడియన్స్ మనసులు గెలిచిన మమితా కు తెలుగు నుంచి కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. మలయాళ భామలకు తెలుగు ఆఫర్లు అంటే లక్కీగా ఫీల్ అవుతారు. అక్కడ హీరోయిన్స్ కు తెలుగులో నటించాలనే ఆసక్తి ఉంటుంది. ప్రేమలు రిలీజ్ తర్వాత తెలుగు యూత్ లో మమితాకు ఏర్పడిన ఈ క్రేజ్ చూసి ఒక బడా నిర్మాత ఆమెను తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. మమితా బైజుని కలిసి కథా చర్చలు జరిపారట. అయితే ప్రేమలు బ్యూటీ మాత్రం తాను మలయాళంలో చాలా బిజీ అని అనేస్తుందట. ప్రేమలు ఊహించిన దాని కన్నా ఎక్కువ హిట్ అవ్వడం వల్ల ప్రేమలు బజ్ ని కొనసాగించేందుకు ప్రేమలు 2 సినిమా రెడీ చేస్తున్నారు. ప్రేమలు 2 కోసం మమితా డేట్స్ ఇచ్చేసింది. మరోపక్క తన నెక్స్ట్ సినిమా కూడా మలయాళంలోనే కమిట్ అయ్యిందట మమితా బైజు.  ఈ గ్యాప్ లో తెలుగు నిర్మాత ఆఫర్ ఇచ్చినా అమ్మడు కాదనాల్సి వచ్చిందట. ప్రేమలు కోసం తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొన్న మమితా ఇక్కడ ఛాన్స్ వస్తే వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పింది. అయితే ఇప్పుడు కూడా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకనే టాలీవుడ్ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టిందట. ఒకవేళ డేట్స్ అడ్జెస్ట్ అయితే మాత్రం తెలుగు ఎంట్రీకి రెడీ అనేస్తుంది అమ్మడు. తెలుగులో ఇప్పటికే విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమా కోసం మమితాను సంప్రదించారన్న టాక్ ఉంది. మమితా తెలుగు స్ట్రైట్ సినిమాలు చేస్తే మాత్రం అమ్మడికి ఇప్పుడున్న క్రేజ్ కన్నా ఎక్కువ వస్తుంది. టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వాలని ఫిక్స్ అయిన మమితా ప్రస్తుతం మలయాళంలో కమిటైన సినిమాలు పూర్తి చేశాక తెలుగు ఆఫర్ల గురించి ఆలోచిస్తుందని తెలుస్తుంది.