ఇండికూటమిలో చిచ్చురేపుతున్న ఆర్​జేడీ అభ్యర్థుల ప్రకటన

ఇండి కూటమిలో ఆర్​జేడీ అభ్యర్థుల ప్రకటన చిచ్చు రేపుతోంది. బిహార్​సీట్ల పంపకాలపై లెక్క కూటమితో లెక్కతేలకపోవడంతో ఆర్​జేడీ సొంత నిర్ణయాన్ని తీసుకొని శనివారం అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది.

Mar 23, 2024 - 20:10
 0
ఇండికూటమిలో చిచ్చురేపుతున్న ఆర్​జేడీ అభ్యర్థుల ప్రకటన

పాట్నా: ఇండి కూటమిలో ఆర్​జేడీ అభ్యర్థుల ప్రకటన చిచ్చు రేపుతోంది. బిహార్​సీట్ల పంపకాలపై లెక్క కూటమితో లెక్కతేలకపోవడంతో ఆర్​జేడీ సొంత నిర్ణయాన్ని తీసుకొని శనివారం అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది. తొలివిడతలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నాలుగు స్థానాల అభ్యర్థులకు ఆర్​జేడీ చోటు కల్పించింది. ఈ నిర్ణయం కాస్త కాంగ్రెస్​ పార్టీకి రుచించడం లేదు. సివాన్, కతిహార్​, మధుబని నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటించడంతో ఈ మూడు స్థానాలను ఆశిస్తున్నసీపీఎం ఎంఎల్​ కూడా ఆశిస్తోంది. కతిహార్​స్థానం కోసం కాంగ్రెస్, సీపీఎం ఎంఎల్ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్​జేడీ అభ్యర్థిని 12 మంది అభ్యర్థులను ప్రకటించింది. ముస్లిం, యాదవ్, కుష్వాహా ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ప్రకటించారు.

ఆర్జేడీ అభ్యర్థులు వీరే..

బంకా- జై ప్రకాశ్ యాదవ్, సరన్- రోహిణి ఆచార్య, ఉజియార్పూర్- అలోక్ మెహతా, పట్లిపుత్ర-మీసా భారతి, బక్సర్- సుధాకర్ సింగ్, జెహనాబాద్- సురేంద్ర యాదవ్, ముంగర్- అనిత్ మహతో, మధుబని- అష్రఫ్ అలి ఫాత్మీ, వైశాలి- రామా సింగ్‌తో 13 నియోజకవర్గాలకు ఆర్జేడీ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు సీపీఎం ఎంఎల్, సీపీఐ, సీపీఎం కూడా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అరాకు సుదామ ప్రసాద్, అవదేష్‌- రాయ్ బెగుసరాయ్, ఖగారియాకు సంజయ్ కుష్వాహాను ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నామని.. కాంగ్రెస్‌కు సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకో వైపు అభ్యర్థులను ప్రకటించేసింది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

బిహార్​లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో కూడా ఇటీవల సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. బీజేపీకి 17, జేడీయూకి 16, మిగతా స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించారు. ఈసారి బీజేపీనే ఒక సీటు ఎక్కువ తీసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.