అల్ జజీరా జర్నలిస్టులు ఉగ్రవాదులే!
కీలక పత్రాలు, ఫోటోలు పంచుకున్న ఐడీఎఫ్
జెరూసలెం: ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ అల్ జజీరాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు జర్నలిస్టులు హమాస్ ఉగ్రవాదులేనని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు చేసింది. గురువారం ఈ జర్నలిస్టులకు సంబంధించిన ఫోటోలు, సమాచారాన్ని ఎక్స్ మాధ్యమంగా పంచుకుంది. వీరంతా హమాస్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారని, గూఢచర్యం ద్వారా సమాచారాన్ని సేకరించి ఉగ్రవాదులతో పంచుకుంటున్నారని విమర్శించింది. ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను గాజాలో లభించాయని పేర్కొంది. ఐడీఎఫ్ స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభించిందని పేర్కొంది. ఉగ్రవాద శిక్షణ, నియామకాలు, ఫోన్ నంబర్లు, వారికి అందే వేతనం వంటి వివరాలున్నాయని స్పష్టం చేసింది.