బడ్జెట్టా.. రాజకీయ ప్రసంగమా?
కొత్తగా ఏముంది రైతులకు వెన్నుపోటు ఉన్న పథకాలకు కేటాయింపులేవీ? వృత్తి కార్మికులు, మత్స్యకారులకు భరోసా ఏది? దళితుల పట్ల ఫ్యూడల్ విధానానికి నిదర్శనం తెలంగాణ ప్రగతి పట్ల కాంగ్రెస్ కు సరైన విధానమే గోచరించలేదా? మహాబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు
నా తెలంగాణ, డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంలానే ఉందని అంతా ట్రాష్ అని మహాబూబాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు విమర్శించారు. గురువారం బడ్జెట్ విడుదలపై ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు. రైతులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టలేదన్నారు. ఉన్న పథకాలను కూడా పక్కన పెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వాటన్నింటినీ అటకెక్కించిందని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు, విద్యుత్, నీటి సరఫరా,గొర్రెల పంపిణీ ఊసే లేదన్నారు. వృత్తి కార్మికులకు కేటాయింపులే లేవన్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించలేదన్నారు. దళిత బంధు ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం శోచనీయమన్నారు. ఇది దళితుల పట్ల ఫ్యూడల్ విధానానికి నిదర్శనమని అన్నారు. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పక్కకు నెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ర్ట ఆర్థిక ప్రగతిపై సరైన విధానమే లేదని నవీన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.