మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్​ లో చిక్కుకున్న ప్రయాణికులు 60 రైళ్లు రద్దు కుప్పకూలిన రాయ్​ గఢ్​ నది వంతెన హై అలర్ట్​ ప్రకటించిన అధికారులు

Jul 25, 2024 - 17:30
 0
మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు

ముంబై: మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రయాణికులు ట్రాఫిక్​ దిగ్భంధనంలో చిక్కుకుంటున్నారు. భారీ వర్షాలతో పలు సబ్​ వేలు, రహదారులు నీటమునగడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​ ను మళ్లించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్​ జారీ చేసి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లవద్దని అధికారులు తెలిపారు.

గురువారం కూడా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 60 రైళ్లను రద్దు చేశారు. ట్రాక్​ లు పూర్తిగా నీటిలో మునగడంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మహారాష్ర్ట రాయ్​ గఢ్​ లోని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. 
పూణెలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు హౌసింగ్​ సొసైటీలు నీటమునిగి వేయి మంది వరకు నీటిలో చిక్కుకుపోవడంతో అధికారులు రెస్క్యూ చర్యలను చేపట్టారు.

మరోవైపు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్​ జారీ చేసింది.