ఐపీసీ సెక్షన్​ లపై పిటిషన్​  తిరస్కరించిన సుప్రీం

The Supreme Court rejected the petition on IPC sections

May 20, 2024 - 14:59
 0
ఐపీసీ సెక్షన్​ లపై పిటిషన్​  తిరస్కరించిన సుప్రీం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్​ లపై సుప్రీంలో దాఖలైన పిటిషన్​ ను కోర్టు కొట్టివేసింది. సోమవారం ఈ పిటిషన్​ పై సుప్రీం జస్టిస్​ బేల ఎం. త్రివేది, జస్టిస్​ పంకజ్​ మిథాల్​ ద్వి సభ్య ధర్మాసనం  విచారించింది. ఇండియన్ జస్టిస్ కోడ్ 2023తో సహా మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు తర్వాత వాటి సరైన పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ బిల్లులను చర్చ లేకుండానే పార్లమెంట్‌లో ఆమోదించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో చాలా మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని పిటిషన్​ లో న్యాయవాది విశాల్​ తివారీ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. పిటిషన్​ తిరస్కరణతో ఐపీసీల అమలుపై ఉన్న అనుమానాలు కాస్త పటాపంచలైనట్లయ్యింది. అదే సమయంలో హిట్​ అండ్​ రన్​ చట్టంపై మాత్రం పలు చర్చల అనంతరం కేంద్రం పలు సవరణల ద్వారా చట్టాన్ని సవరించి అందరి ఆమోదం పొందాక అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. 

ఐపీసీ సెక్షన్​ 302 – 101గా, సెక్షన్​ 420– 316గా, సెక్షన్​ 307–109గా, సెక్షన్​ 376–63గా మారేందుకు మార్గం సుగమమైంది. 

మార్పులేంటి?..

ఇండియన్ కోడ్ ఆఫ్ జస్టిస్ (బీఎన్​ఎస్​)కి 20 కొత్త నేరాలను జోడించారు. వ్యవస్థీకృత నేరం, హిట్ అండ్ రన్, మాబ్ లిన్చింగ్‌లపై శిక్షకు నిబంధనలు రూపొందించారు. పత్రాలలో ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులు ఉండనున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఐపీసీలో ఉన్న 19 నిబంధనలు తొలగించారు.  33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నేరాల్లో పెనాల్టీని పెంచారు.
ఆరు నేరాల్లో సమాజ సేవకు శిక్ష విధించే నిబంధనను పొందుపరిచారు.