పర్యావరణ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

రీ ఇన్వెస్ట్​ గ్లోబల్​ సమ్మిట్​ –2024లో ప్రధాని మోదీ

Sep 16, 2024 - 14:14
 0
పర్యావరణ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం
పారిస్​ లక్ష్యాన్ని 9యేళ్లముందే సాధించాం
3 లక్షల ఇళ్లపై సోలార్​ ఫలకల ఏర్పాటు
రాబోయే పదేళ్లలో సోలార్​ సిటీలుగా 17 నగరాలు
మూడురోజుల సదస్సులో 140 దేశాల నుంచి 10వేలమంది ప్రతినిధులు హాజరు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పర్యావరణ హితంగా అభివృద్ధికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సోమవారం గుజరాత్​ లోని గాంధీనగర్​ లో మహాత్మా మందిర్​ లో రీ ఇన్వెస్ట్​ గ్లోబల్​ మీట్​ –2024 కార్యక్రమాన్ని ప్రారంభించి సూర్యఘర్​ ముఫ్త్​ బిజిలీ యోజనను జాతికి అంకితం చేశారు. 
 
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పారిస్​ లో నిర్దేశించిన వాతావరణ కట్టుబాట్లను లక్ష్యానికి తొమ్మిదేళ్ల ముందు భారత్​ సాధించిందన్నారు. దేశం హరితంలో పరివర్తనను ఉద్యమంలా మార్చిందని మోద తెలిపారు. పీఎం సూర్యఘర్​ తో ప్రతీ ఇంటిని విద్యుత్​ ఉత్పత్తిదారునిగా మార్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పథకం ద్వారా 3 లక్షల ఇళ్లపై సోలార్​ ఫలకలు ఏర్పాటు చేశామన్నారు. ఈ రంగంలో యువతకు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. యువతకు ఈ రంగంలో మరింత నైపుణ్యతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. 
 
దేశంలో 17 నగరాలను సోలార్​ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు. పదేళ్లలో గ్రీన్​ హైడ్రోజన్​ తో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి రంగాలలో విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రంగంలో ఎదుగుతున్న భారత్​ లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపారులకు పిలుపునిచ్చారు. 
 
ఎనర్జీ రంగంలో భారత్​ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి అన్నారు. 86 శాతం వృద్ధిని నమోదు చేసింది. పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్​ ను అగ్రగామిగా మార్చనున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్​ ప్రకటించారు. 
 
మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో 40 సెషన్​ లు ఉండనున్నాయి. ఇందులో ఫైనాన్సింగ్​, గ్రీన్​ హైడ్రోజన్​, భవిష్యత్​ ఇంధన అవసరాలు, సమస్యలు, పరిష్​కారాలు వంటి వాటిపై చర్చించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 140 దేశాల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలుత సూర్యఘర్​ ద్వారా లబ్ధి పొందిన వారితో మాట్లాడారు.