తొక్కిసలాట పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
The Supreme Court refused to hear the stampede petition

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది. సోమవారం తొక్కిసలాట ఘటన పిటిషన్ విచారణకు రాగా సుప్రీం పై విధంగా వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని పేర్కొంది. తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిల్ ను దాఖలు చేశారు. భద్రత చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మృతుల వివరాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.