ముంబాయి విమానాశ్రయంలో రూ. 50 కోట్ల డ్రగ్ స్వాధీనం
At Mumbai Airport Rs. 50 crore drug seized

ముంబాయి: ముంబాయి విమానాశ్రయంలో రూ. 50 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ (మత్తుపదార్థం) డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు బంగారం, వజ్రాలను కూడా చేశారు. వీటిలోపాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్ అధికారులు చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలు ఆదివారం వెలుగులోకొచ్చాయి. జనవరి 28 నుంచి 31 వరకు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో రూ. 50.116కోట్ల విలువైన హైడ్రోపినిక్, రూ. 93.8 లక్షల విలువైన వజ్రాలు, రూ. 1.5 కోట్ల విలువైన 2.073 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయం ద్వారా స్మగ్లింగ్ కార్యకలాపాలపై ఇంటలిజెన్స్ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ తో కలిసి కస్టమ్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్ ముఠాకు విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సహకరిస్తున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రీసీవర్లు, ఐదు ఓవల్ ఆకారపు క్యాప్సూల్స్, మైనపు రూపంలో ఉన్న రెండు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం 6.05 కిలోలు మార్కెట్ విలువ రూ. 4.84 కోట్లు ఉంటుందన్నారు.