ఎస్​ఎస్​ సీటీయూకు తొలి వైస్​ చాన్స్​ లర్​ నియామకం

ప్రొఫెసర్​ యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్​ కు బాధ్యతలు

Mar 11, 2025 - 18:48
 0
ఎస్​ఎస్​ సీటీయూకు తొలి వైస్​ చాన్స్​ లర్​ నియామకం

నా తెలంగాణ, ములుగు: అరోరా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్​ యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్​ ములుగు సమ్మక్క సారక్క సెంట్రల్​ ట్రైబల్​ యూనివర్సిటీ (ఎస్​ఎస్​ సీటీయూ)కి తొలి వైస్​ చాన్స్​ లర్​ గా నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్​ ట్రైబల్​ యూనివర్సిటీకి తొలిసారిగా వీసిని నియమించింది. ఈయన ఐదేళ్లపాటు యూనివర్సిటీ వీసీగా పదవిలో కొనసాగనున్నారు. 

ఈ యూనివర్సిటీకి కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం పెద్దపీట వేసింది. రూ. 900 కోట్లను కేటాయించింది. సమ్మక్క సారక్క ట్రైబల్​ యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తానని కూడా కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 2024లో తాత్కాలిక భవనాలలో యూనివర్సిటీని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పలువురు రాష్ట్రమంత్రులతో కలిసి ప్రారంభించారు.