సిరియాలో పేలుడు 15 మంది మృతి!

Explosion in Syria kills 15 people!

Feb 3, 2025 - 13:55
 0
సిరియాలో పేలుడు 15 మంది మృతి!

డెమాస్కస్: సిరియా మన్​ బిజ్​ నగరంలోని సోమవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15మంది మృతి చెందగా, చాలామందికి గాయాలయ్యాయి. వ్యవసాయ కార్మికులు ప్రయాణిస్తున్న వాహనంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకోలేదన్నారు. ఇస్లామిక్​ స్టేట్​ (ఐఎస్​ఐఎస్​) ప్రభావం తగ్గినా ఇంకా ఉగ్ర కార్యకలాపాలు, దాడులు ఏ మాత్రం సిరియాలో ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బాంబుపేలుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.