రైతుల శ్రేయస్సుకు కేంద్రం కట్టుబడి పనిచేస్తుంది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైతుల శ్రేయస్సుకు, ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం బుధవారం సాయంత్రం ప్రధాని తన సందేశాన్ని ఇచ్చారు. 2025లో తొలి మంత్రివర్గ భేటీలో రైతుల శ్రేయస్సును పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమైన నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం తొలి నిర్ణయంలోనే కోట్లాది మంది రైతులకు మేలు చేకూర్చే నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. రైతు పంటలకు రక్షణ, బీమా, డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంపుదల, రైతుల ఆందోళనను పూర్తిగా తగ్గించగలిగామన్నారు. రైతులకు సరసమైన ధరలకే సబ్సిడీని అందించడంలో సహాయం చేస్తామన్నారు.