ఎర్రకోటపై దాడి.. ఉగ్రవాది క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి
Attack on Redfort President rejects pardon from terrorists
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎర్రకోటపై దాడి చేసి పాక్ ఉగ్రవాది మహ్మద్ ఆరీఫ్ క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ బుధవారం తిరస్కరించారు. దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఎర్రకోటలోకి చొరబడి ఆరీఫ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దాడి అనంతరం ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దాడి ఘటన జరిగిన 24 యేళ్లు గడుస్తోంది. సుప్రీం కోర్టు అతన్ని దోషిగా నిర్ధరిస్తూ ఉరిశిక్ష విధించింది. దీనిపై క్షమాభిక్ష పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించింది.