రూ.2000 నోట్లు ప్రజలవద్దే రూ. 6,691 కోట్లు!
Rs.2000 notes from public Rs. 6,691 crores!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇప్పటికీ రూ. 6,691 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. బుధవారం మరోమారు రూ. 2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. 2023 మే 19న రూ. 2000 నోట్లను ఉసంహరించుకున్నామని తెలిపింది. మే చివరి నాటికి రూ. 3.56 లక్షల కోట్లుగా రూ. 2వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023 అక్టోబర్ 7 వరకు రూ. 2 వేల నోట్ల మార్పిడి అన్ని బ్యాంకులలో కల్పించామన్నారు. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ 19 శాఖల్లో నోట్ల మార్పిడి సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో బ్యాంక్ నోట్ డిపాజిట్/మార్పిడికి అవకాశం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.