గాజాలో ఇజ్రాయెల్​ దాడి ఇద్దరు జర్నలిస్టులు మృతి

సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్​ జరిపిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించినట్లుగా ప్రకటించింది.

Mar 31, 2024 - 20:52
 0
గాజాలో ఇజ్రాయెల్​ దాడి ఇద్దరు జర్నలిస్టులు మృతి

న్యూఢిల్లీ: సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్​ జరిపిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించినట్లుగా ప్రకటించింది. సెంట్రల్​ గాజాలోని అల్​ అక్సా ఆసుపత్రి సమీపంలో టెంట్​పై ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు పాలస్తీనా వర్గాలు ప్రకటించాయి. సోషల్ మీడియాలో దాడికి సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఆ వీడియోలో ఇజ్రాయెల్​ దాడుల్లో పాలస్తీనాలో ప్రజలు కేకలు వేస్తూ పరిగెడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజా వైమానిక దాడులు, భూ కార్యకలాపాలలో ఇప్పటివరకు 32 వేల మందికి పైగా మరణించారు. గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతరం దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అనేక వేల మంది హమాస్ ఉగ్రవాదులు కూడా మరణించారని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.