భారత్ కు 14.3 శాతం చెల్లింపులు
14.3 percent remittances to India
తరువాతి స్థానాల్లో మెక్సికో, చైనా
మోదీ విధానాలతో రెమిటెన్స్ లకు ఊతం
కష్టకాలాన్ని అధిగమించి వృద్ధి దిశగా ముందుకు
గత పదేళ్లలో భారీ వృద్ధి నమోదు
ద్రవ్యలోటు భర్తీలోనూ కీలకపాత్ర
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రపంచ మార్కెట్ లో రెమిటెన్స్ 2024లో (చెల్లింపులు) భారత్ కు 14.3 శాతం వచ్చాయి. ఇది చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉండడం గమనార్హం.
విదేశాలలో నివసిస్తున్న భారతీయులు తమ కుటుంబ పోషణ, ఇతర అవసరాల కోసం చేసే చెల్లింపులనే రెమిటెన్స్ (చెల్లింపులు) అంటారు. ఏ దేశానికైనా ఈ రెమిటెన్స్ లు ప్రధాన ఆదాయ వనరులుగా పనిచేస్తాయి. అభివృద్ధి చెందుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు ఈ చెల్లింపుల ద్వారా మరింత ఊతం లభిస్తుంది.
భారత్ ను అందుకోని ప్రత్యర్థి దేశాలు..
2024 లో, భారతదేశం 1,29,088 బిలియన్ డాలర్ల విలువైన రెమిటెన్స్ లను అందుకోగలిగింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం ఇది అత్యధిక చెల్లింపులు కలిగినదిగా రికార్డుగా నిలిచింది. భారత్ తరువాత అత్యధిక రెమిటెన్స్ లు అందుకున్న దేశాలుగా మెక్సికో 68,225 బిలియన్ డాలర్లు, చైనా 48,000 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్ 40,232 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 37,304, పాక్ 33,198 బిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్ 26,602 బిలియన్ డాలర్లు, గ్వాటెమాలా 21,577 బిలియన్ డాలర్లు, ఈజిప్ట్ 22, 657 బిలియన్ డాలర్లు, జర్మనీ 21,540 బిలియన్ డాలర్లను అందుకున్నాయి. రెమిటెన్స్ లు అందుకున్న దేశాల్లో సుదూరం వరకు భారత్ సరసన నిలవగలిగిన దేశాలు లేవనే చెప్పాలి. అదే సమయంలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, మెక్సికో, చైనా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
అభివృద్ధి సహాయం కంటే రెమిటెన్స్ లే ఎక్కువ..
రెమిటెన్స్ ల వృద్ధిపై ఫ్లోరిష్ లోగో సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తుంది. కరోనా అనంతరం కాలంలో భారత్ కు అందే రెమిటెన్స్ లలో పెరుగుదల చోటు చేసుకుంది. భారత ద్రవ్యలోటును భర్తీ చేయడంలో చెల్లింపుల పాత్ర కీలకం నిలుస్తుంది. భారత్ 2024లో రెమిటెన్స్ లు జీడీపీలో 3.3 శాతం ఉన్నాయి. ఒకదేశం మరొక దేశంలో వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా నడపడానికి పెట్టుబడులు పెడుతుంది. ఈ దేశాలకు భారత్ నుంచి అందుతున్న అభివృద్ధి సహాయం కంటే రెమిటెన్స్ లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పేద దేశాలు అభివృద్ధి చెందేందుకు సహాయపడేందుకు ధనిక దేశాలు తరచుగా గ్రాంట్లు, రుణాలను మంజూరు చేస్తుంటాయి. దీంతో ఆయా దేశాలు ఆర్థిక సమతుల్యత దెబ్బతినకుండా ఈ రెమిటెన్స్ లు కీలక పాత్ర పోషిస్తాయి. గత పదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యల వల్ల భారత్ రెమిటెన్స్ లు 57 శాతం పెరిగాయి.
2020 మినహా గత ఐదేళ్లలో భారతదేశం ప్రతి సంవత్సరం 100 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ రెమిటెన్స్‌లను పొందుతోంది. 2020లో భారత్‌కు 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2023లో నమోదైన 1.2 శాతంతో పోలిస్తే ఈ సంవత్సరం రెమిటెన్స్‌ల వృద్ధి రేటు 5.8 శాతంగా అంచనా వేశారు.
గత పదేళ్ల కాలంలో భారత్ రెమిటెన్స్‌లు 57 శాతం పెరిగాయి. 2014–2024 మధ్య దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు, 2014లో 70 బిలియన్లు, 2015లో 69 బిలియన్లు, 2016లో 63 బిలియన్లు, 2017లో 69 బిలియన్లు, 2018లో 79 బిలియన్లు, 2019లో 79 బిలియన్లు, 2020లో 83 బిలియన్లు, 2021లో 105 బిలియన్లు, 2022లో 125 బిలియన్లు 2023 – 2024లో 129 బిలియన్ డాలర్లకు చెల్లింపులు పెరిగాయి.