ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం

ఆరెంజ్​ అలర్ట్​ జారీ 25‌0 నుంచి 467 వరకు ఏక్యూఐ!

Oct 18, 2024 - 13:08
 0
ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ఏక్యూఐ–250 నుంచి 467 వరకు నమోదైంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం, ఎంసీడీ అలర్టయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.  శుక్రవారం కాలుష్​య నివారణకు రోడ్లపై నీటిని చల్లుతున్నారు. ఢిల్లీలోని యమనా నదీలో భారీగా నీరు కలుషితమై నురగలుగా పారుతోంది. అనేక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణలో అధికార, ప్రభుత్వం విఫలమైందనే వాదనలు వినబడుతున్నాయి. ఇండియా గేట్​ వద్ద 270గా ఎక్యూఐ నమోదైంది. వసంత్​ విహార్ వద్ద 339గా నమోదైంది. ఈ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు స్పష్టం చేశారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

ఢిల్లీలోని అలీపూర్ 308, ఆనంద్ విహార్ 346, బవానా 331, బురారీ 327,ద్వారక 328, జహంగీర్‌పురి 354, ముండ్కా 373, నరేలా 320, రోహిణి 362 ప్రాంతాలలో కాలుష్యం నమోదుకాగా అత్యధికంగా జహంగీర్​ పూర్​ లో 467 ఎక్యూఐ నమోదైంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ఢిల్లీలో కాలుష్యం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది.