విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి

నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Jun 18, 2024 - 17:56
 0
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి

నా తెలంగాణ, నిర్మల్: విద్యా రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థలను, రెసిడెన్షియల్ పాఠశాలలను ఆయన మంగళవారం సందర్శించారు. ఇందులో భాగంగా నిర్మల్ లోని సోఫీనగర్  గురుకుల పాఠశాలతో పాటు నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్ మండలాల్లోని కస్తూర్బా విద్యాసంస్థలను పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో ఉన్న వసతులు, అవసరమైన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు తీరును పరిశీలించారు.  ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. బాగా చదివి కుటుంబానికి, ప్రాంతానికి మంచిపేరు తేవాలని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.