వేగవంతమైన రవాణా ఐఎంఈసీ కారిడార్​ కీలకం

IMEC Corridor is key for fast transport

Sep 6, 2024 - 19:30
 0
వేగవంతమైన రవాణా ఐఎంఈసీ కారిడార్​ కీలకం
కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వస్తువులను వేగవంతంగా తరలించేందుకు భారత్​–మిడిల్​ఈస్ట్​–యూరోప్​ ఎకనామిక్​ కారిడార్​ (ఐఎంఈసీ) కీలకం కానుందని కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు. న్యూ ఢిల్లీలోని శుక్రవారం తొలి ఇడియా మెడిటరేనియన్​ బిజినెస్​ కాన్​ క్లేవ్​ –2024లో ప్రసంగించారు. 
కారిడార్​ ల అభివృద్ధి ద్వారా ఐరోపా–ఆసియా సముద్రంలో కూడా వేగవంతమైన రవాణా సాధ్యపడుతుందన్నారు. 
 
జీ–20లో ఐఎంఈసీ ప్రారంభించాలని భారత్​ నిర్ణయించిందన్నారు. దీనికి యూఏఈ, జోర్డాన్​, ఇజ్రాయెల్​, యూరోపియన్​ దేశాలు భాగస్వామ్యం వహించడం హర్షణీయమన్నారు. దీంతో మధ్యప్రాచ్యాన్ని ఏకీకృతం చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 
 
దీంతో లాజిస్టిక్​ ఖర్చులు భారీగా తగ్గడమే గాక వేగవంతమైన కనెక్టివిటీ, వస్తువుల తరలింపు సులభమవుతుందన్నారు. తద్వారా వ్యాపార, వాణిజ్యాల్లో భారీ పెరుగుదల నమోదవుతుందన్నారు. దీంతో ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాగలవన్నారు. అన్ని దేశాలకు ఆర్థిక ప్రయోజనాల సత్ఫలితాలు అందుతాయని పీయూష్​ గోయల్​ తెలిపారు. భారత్ లో పండే పంటలు మధ్యధరా దేశాలకు వెళ్లడంలో ఈ విధానం కీలకం అవుతుందన్నారు. దీంతో అపారమైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పీయూష్​ గోయల్​ వివరించారు.