స్వైన్​ ఫ్లూ అలర్ట్​ జారీ!

Swine flu alert issued!

Mar 11, 2025 - 15:19
 0
స్వైన్​ ఫ్లూ అలర్ట్​ జారీ!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో మరోమారు స్వైన్​ ఫ్లూ కేసుల్లో పెరుగుదల నమోదవుతుంది. మంగళవారం నేషనల్​ సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ (ఎన్​ సీడీసీ) నివేదిక జారీ చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు అలర్ట్​ జారీ చేసింది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో స్వైన్​ ఫ్లూ కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఎనిమిది రాష్ట్రాల్లో హెచ్​1ఎన్​1 వైరస్​ ఇన్ఫెక్షన్​ వేగంగా వ్యాపిస్తుందని స్పష్​టం చేసింది. 16రాష్ట్రాల్లో ఈ వ్యాధి బారిన పడగా, ఆరుగురు మృతిచెందారని తెలిపింది. మరణాల సంఖ్య కేరళలో ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం.. ఢిల్లీ, కర్ణాటక, కేరళ,  తమిళనాడు,  పుదుచ్చేరి, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, గుజరాత్​ లో స్వైన్ ఫ్లూకు సంబంధించి నిఘా పెంచాలని ఎన్​ సీడీసీ విజ్ఞప్తి చేసింది. తమిళనాడు - 209, కర్ణాటక -76, కేరళ 48, జమ్మూ కాశ్మీర్ 41, ఢిల్లీ 40, పుదుచ్చేరి 32, మహారాష్ట్ర 21, గుజరాత్14 కేసులు నమోదైనట్లు వివరించింది.2024లో దేశ వ్యాప్తంగా స్వైన్​ ఫ్లూ కేసులు 20,414 మందికి సోకగా, 347 మంది మృతిచెందారు. 2019లో అత్యధికంగా 29,798 కేసులు నమోదు కాగా 1,218 మంది మృతిచెందారు.