స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన సునీతా
Sunita leaves the space statio

19 వేకువజామున 3.27 ఫ్లోరిడాలో ల్యాండ్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎట్టకేలకు మంగళవారం ఉదయం 10.35 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు బయలుదేరారు. వీరితోపాటు ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ లు కూడా భూమికి తిరిగి వస్తున్నారు. 9 నెలల 12 రోజుల తరువాత మార్చి 19న వేకువజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో దిగుతుందని నాసా స్పష్టం చేసింది. అంతరిక్షం నుంచి వీరు భూమిపైకి చేరేందుకు దాదాపుగా 17 గంటల సమయం పట్టనుందని మిషన్ పూర్తి వివరాలను నాసా వివరించింది.
ఆరుదశలు..
వ్యోమగాములను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆరుదశలు కీలకం.
– తొలిదశలో ఎస్ర్టోనాట్ లు స్పేస్ సూట్ లు వేసుకోవడం అనంతరం పలు రకాల టెస్టింగ్ లు నిర్వహిస్తారు.
– రెండో దశలో వీరిని భూమికి తీసుకురానున్న స్పేస్ క్రాఫ్ట్ (రాకెట్) అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి విడిపోతుంది. థ్రస్టర్ లు రాకెట్ ను దూరం నెట్టివేస్తాయి. దీంతో పూర్తిగా రాకెట్ భాగం ఐఎస్ఐస్ నుంచి వేరు పడుతుంది.
– మూడో దశలో డీ ఆర్బిట్ ను మండిస్తారు. డ్రాకో అనే థ్రస్టర్ అపసవ్యదిశలో మండుతుంది. దీంతో వేగం తగ్గుతుంది. ఇక భూమి దిశలో ప్రయాణిస్తుంది.
– నాలుగో దశలో సౌరమండలం నుంచి 27వేల కి.మీ. వేగంతో వాయు (భూ వాతావరణం) మండలంలోకి ప్రవేశిస్తుంది. ఇందులో చేరగానే రాకెట్ పై భాగం ఉష్ణోగ్రత 1650 డిగ్రీల సెల్సీయస్ కు చేరుకుంటుంది. దీంతో 3నుంచి 5 నిమిషాలపాటు బూస్టర్ లను నిలిపివేస్తారు.
– ఇక ఐదో దశలో 18వేల ఫీట్ల ఎత్తులో రెండు పారాచూట్ లు తెరుచుకుంటాయి. ఆరువేల ఫీట్ల వద్ద మరో నాలుగు పారాచూట్ లు తెరుచుకుంటాయి. దీంతో రాకెట్ వేగం కేవలం 24 కి.మీ గా ప్రయాణిస్తుంది.
– అంతిమ ఆరో భాగంలో వీరు ప్రయాణించిన ప్రత్యేక షెల్ సముద్రంలో లాంచ్ అవుతుంది. ముందే ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఆ షెల్ ను సురక్షితంగా పెద్ద బూటులోకి తీసుకొని అందులో ఉన్న వ్యోమగాములను బయటకు తీస్తారు. అనంతరం వీరిని ప్రత్యేక వైద్యచికిత్సల కోసం తరలిస్తారు.