సోరోస్ ఓఎస్ఎఫ్ సంస్థల్లో సోదాలు
Searches at Soros OSF institutions

బెంగళూరు: అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కు చెందిన బెంగుళూరులోని పలు సంస్థలపై ఈడీ మంగళవారం దాడులు నిర్వహించింది. ఓఎస్ఎఫ్ అనే సంస్థకు జార్జీ సోరోస్ కు చెందిన నిధులు సమకూరాయని, ఇది ఫెమా చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని ఈడీ ఆరోపించింది. ఓఎస్ఎఫ్ అనుబంధ సంస్థలను ఈడీ సోదాలు నిర్వహించింది. జార్జ్ సోరోస్, ఓఎస్ఎఫ్ భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఈడీ ఆరోపించింది. ఓఎస్ఎఫ్ ను జార్జ్ సోరోస్ 1999లో ప్రారంభించారు. సోరోస్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా దగ్గరి సంబంధాలున్నాయనే ఆరోపణలు, విమర్శలున్నాయి. సోరో ఆస్తుల విలువ మొత్తం రూ. 61 వేల కోట్లుగా చెబుతారు. ఇతను 200 దేశాల్లో పలు రకాల స్వచ్ఛంద సంస్థల ముసుగులో విరాళాలతో అక్కడి రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. 2020లో దావోస్ లో మోదీ ప్రపంచాన్ని తప్పుబట్టారు. జాతీయవాదాన్ని పెంచుతున్నారని అన్నారు. అదే సమయంలో భారత్ లో తన సంస్థల ముసుగు వేసుకొని హిందువులను మతమార్పిడికి గురిచేస్తున్నారన్న ఆరోపణలు, ఋజువులపై జవాబులు పలుమార్లు దాటవేశారు. హిండెన్ బర్గ్ రిపోర్టు కు కూడా ఇతనే కారణంగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే అదానీకి ఈ రిపోర్టుపై అమెరికా సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.