ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్​!

Seema Haider gives birth to a baby girl!

Mar 18, 2025 - 13:18
 0
ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్​!

నోయిడా: సీమా హైదర్​ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఈ విషయాన్ని సీమా హైదర్​ న్యాయవాది ఏపీ సింగ్​ మీడియాకు తెలిపారు. నోయిడాలోని కృష్ణ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆడపిల్లకు జన్మనిచ్చిందన్నారు. ఈమెకు ఐదో సంతానం. ప్రస్తుతం తల్లి బిడ్డల ఆరోగ్యం క్షేమంగా ఉందని తనకు తోడుగా భర్త కూడా ఉన్నాడని వివరించారు. 

సీమా హైదర్​ 2023లో ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం సామాజిక మాధ్యమం వేదికగా నోయిడాకు చెందిన సచిన్​ మీనాతో ప్రేమలో పడి అక్రమ మార్గంలో భారత్​ లోని ప్రవేశించి పెళ్లి కూడా చేసుకుంది. అనంతరం విచారణలు, కోర్టులు, హైదర్​ భర్త ఆరోపణలు ఇలా అనేక రకాల ఆరోపణలు, విమర్శలను,  కేసుల ఎదుర్కొన్నారు. చివరకు సచిన్​, సీమా ఒక్కటయ్యారు. 2014లో సీమా హైదర్​ ను గులాం హైదర్​ అనే పాకిస్థాన్​ కు చెందిన వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. అనంతరం కరాచీలో లో ఈమెను వదిలి దుబాయ్​ వెళ్లిపోయాడు. 2019 నుంచి ఆన్​ లైన్​ మాధ్యమంగా సచిన్​ కు సీమాతో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమకు దారి తీసి చివరకు కథ సుఖాంతమైంది.