రైల్వే ఉద్యోగులకు తీపి కబురు

Sweet talk for railway employees

Sep 4, 2024 - 17:25
 0
రైల్వే ఉద్యోగులకు తీపి కబురు

రూ. 100కే యూనిక్​ కార్డు
గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స
కార్డు లేకున్నా చికిత్స.. యూఎంఐడీ నెంబర్​ జారీ
ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్​ ప్రణబ్​ కుమార్​ మాలిక్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రైల్వే శాఖ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురందించింది. రూ. 100కే యూనిక్​ కార్డును అందజేసే ఉత్తర్వులను రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్​ ప్రణబ్​ కుమార్​ మాలిక్​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్డు ద్వారా గుర్తింపు పొందిన ఆసుపత్రులతోపాటు ఎయిమ్స్​ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్య సౌకర్యం పొందవచ్చు. దీంతో 27 లక్షల మంది రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఆసుపత్రులలో ఈ కార్డు చూపిస్తే ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే చికిత్సలు అందజేయనున్నారు. 

రైల్వే ఉద్యోగులు, పెన్షనర్ల ఫిర్యాదులు, విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో వైద్యులు తమకు ఇష్టమైన ఆసుపత్రుల పేరుతో రోగులను రిఫర్​ చేసే విధానానికి పూర్తిగా నిషేధం విధించినట్లవుతుందని తెలిపారు. త్వరలోనే ఈ విధానం ద్వారా ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల జాబితాను విడుదల చేస్తామనిప్రకటించారు. హెల్త్​ మేనేజ్​ మెంట్​ ఇన్ఫర్మేషన్​ సిస్టమ్​ ద్వారా కార్డు డిజీ లాకర్​ లో ఉంటుందన్నారు. ఇది ఉద్యోగులు, పెన్షనర్ల ప్రొఫైల్​ లలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్డు ద్వారా అన్ని రైల్వే ఆసుపత్రులు, ఎంప్యానెల్​ ఆసుపత్రులు,డయాగ్నస్టిక్​ సెంటర్​ లలో అత్యవసర, సాధారణ చికిత్సల కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్డు తమ వద్ద లేకున్నా చికిత్స పొందే విధానాన్ని ప్రవేశపెట్టామని ఇందుకోసం యూఎంఐడీ నెంబర్​ జారీ చేశామని ఈ ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు.