ఇక భరించం అంబేద్కర్ ను వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్
Congress is the party that opposes Aghargam Ambedkar
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
విదేశీ శక్తులకు ప్రోత్సాహం
చర్చలు వాస్తవాలపైనే ఆధారపడి ఉంటాయి
దేశభక్తులను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోం
జమిలిపై 31 మంది ఎంపీలతో కమిటీ ఏర్పాటు?
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అంటేనే అంబేద్కర్ ను వ్యతిరేకించే పార్టీ అని, వాస్తవాలను వక్రీకరించే పార్టీ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో బీజేపీ, అమిత్ షా, ప్రధాని మోదీలపై ఉభయ సభల్లో బుధవారం చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాజ్యాంగ కూర్పు, దేశ హితంపై బీజేపీ, ప్రధాని మోదీ పనిచేస్తున్నాయన్నారు. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ దురుద్దేశపూరితంగా ప్రయత్నం చేస్తుందని అమిత్ షా అన్నారు. హస్తం పార్టీ బాబా సాహెబ్ ను ఎలా వ్యతిరేకించిందో పార్లమెంట్ లో రుజువైందని మండిపడ్డారు.
అమరవీరులను అవమానిస్తారా?..
అంబేద్కర్ రిజర్వేషన్ వ్యతిరేకంగా, వీర్ సావర్కర్ పై విమర్శలు, ఆరోపణలు అవమానాలు ఇంతవరకూ భరించామన్నారు. ఎమర్జెన్సీతో రాజ్యాంగంలోని అన్ని విలువలను నాశనం చేసిందని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక యేళ్ల తరబడి మహిళల గౌరవాన్ని విస్మరించారని, అమరవీరులను అవమానించేలా చేశారని, కనీసం జమ్మూకశ్మీర్ లో భారత జెండా ఎగురవేసిన పాపాన పోలేదన్నారు. దీంతో విదేశీ శక్తులు భారత్ పై రాజ్యమేలయన్నారు.
భిన్నాభిప్రాయాలా?..
లోక్ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్, కూటమి పార్టీల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయన్నారు. చర్చలు ఎప్పటికీ వాస్తవాలపై ఆధారపడి ఉండాలన్నారు. మంగళవారం నుంచి కాంగ్రెస్ వాస్తవాలను వక్రీకరించే బాధ్యతను తలకెత్తుకుందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అవమానించేందుకు దేశంలో ఏ ఒక్క రాయిని వదల్లేదన్నారు. అంబేద్కర్ వ్యతిరేక పార్టీ దేశ భక్తులను సైతం అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ప్రియాంకకు చోటు?..
మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి) అమలుపై జేపీసీ 31 మంది ఎంపీలతో కమిటీ ఏర్పాటు ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి. వీరంతా బిల్లును మరోమారు సమీక్షించనున్నారు. 31మందిలో 21 మంది లోక్ సభ నుంచి ఉంటారు. కమిటీ ఏర్పాటైన 90 రోజుల్లోపు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఈ కమిటీలో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ కూడా ఉండనున్నారనే టాక్ వినిపిస్తుంది.
భారత విద్యా సంస్థల్లో 46,800మంది విదేశీ విద్యార్థుల పేర్లు నమోదు..
8.9 లక్షల మంది భారతీయ విద్యార్థులు 2023లో విదేశాల్లో చదువుకున్నారని విద్యా సహాయ మంత్రి డి. సుకాంత మజుందార్ తెలిపారు. 2019లో 5.86 లక్షల మంది విద్యార్థులుగా నమోదైనట్లు రాజ్యసభకు వెల్లడించారు. అదే సమయంలో భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో దాదాపు నలభై ఆరు వేల ఎనిమిది వందల మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసించేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని మజుందార్ తెలిపారు. స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ భారతీయ విద్యను ప్రోత్సహిస్తుందన్నారు.
99.9 శాతం చెరకు బకాయిల చెల్లింపు..
చక్కెర సీజన్లలో 99.9 శాతం 20222–23కు సంబంధించిన చెరకు బకాయిలను చెల్లించామని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2023–-24కి మొత్తం చెరకు బకాయిలు 1.11 లక్షల కోట్ల రూపాయలలో దాదాపు రూ. 1.10 లక్షల కోట్లు చెల్లించామన్నారు. ఈ కాలానికి సంబంధించి రైతులకు 99 శాతం చెరకు బకాయిలు క్లియర్ అయ్యాయని ఆయన చెప్పారు. ప్రస్తుత చక్కెర సీజన్ 2024–-25లో మొత్తం చెరకు ధర 11,141 కోట్ల రూపాయల్లో ఇప్పటికే 8,126 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
పీఎం కెయూఎస్యూఎం కింద రూ. 4388 కోట్లు చెల్లింపు..
ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్ పథకం కింద 2019 నుంచి ఇప్పటివరకూ రూ. 4388 కోట్ల రూపాయలను రాష్ర్టాలకు మంజూరు చేసినట్లు ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్ సభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019లో పీఎం కెయూఎస్ యూఎం పథకాన్ని ప్రారంభించారు.