సీఎం ప్రమాణ స్వీకారంలో స్వాతి మాలివాల్​

Swati Maliwal taking oath as CM

Feb 20, 2025 - 18:06
 0
సీఎం ప్రమాణ స్వీకారంలో స్వాతి మాలివాల్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారంలో ఆప్​ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్​ హాజరయ్యారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న వీడియో సాయంత్రం బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పలు ట్వీట్​ లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సీఎం, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రేఖా గుప్తా ఆధ్వర్యంలో ఢిల్లీ అభివృద్ధికి చక్కటి మార్గం పడుతుందన్నారు. ఢిల్లీ ప్రజల అంచనాలను ఆమె నెరవేరుస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఆప్​ అధినేత కేజ్రీవాల్​ ప్రారంభించిన ఉద్యమానికి ద్రోహం చేయడం సిగ్గు చేటన్నారు. అసెంబ్లీలో కాగ్​ నివేదికను సైతం బయట పెట్టలేదని విమర్శించారు. ఆయన అవినీతిని బయటపెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో యమునా నదిని వీలైనంత త్వరగా శుభ్రం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛమైన నదిగా ఉన్న యమునా పదేళ్లలో మురికి కాలువగా మారడం శోచనీయమని స్వాతి మాలివాల్​ ఆవేదన వ్యక్తం చేశారు.