రష్యాకు మద్ధతు ఉక్రెయిన్ కు అమెరికా ఝలక్!
భారత్ సహా 65 దేశాలు ఓటింగ్ కు దూరం

న్యూ యార్క్: ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్ లో అమెరికా అనుకూలంగా ఓటింగ్ చేసింది. భారత్ ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. మంగళవారం యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటింగ్ నిర్వహించారు. రష్యా దాడిని ఖండిస్తూ వెంటనే తమ దేశం నుంచి రష్యన్ దళాలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మరియానా బెట్సా తీర్మానం ప్రవేశపెట్టింది. అమెరికా ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా రష్యాకు మద్ధతునిచ్చింది. భారత్ సహా 65 ఆదేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు కాగా ప్రతిపాదనకు మద్ధతు తెలిపిన దేశాల్లో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, పలు యూరోపియన్ దేశాలున్నాయి. ప్రతిపాదనలో ప్రధానంగా మూడు డిమాండ్లను ఉంచారు. రష్యా దళాలను ఉపసంహరించుకోవడం, శాంతికి సహకరించడం, యుద్ధనేరాలపై రష్యాను విచారించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. అయితే అమెరికా ప్రాణనష్టం, ఆస్తినష్టంపై సంతాపం వ్యక్తం చేసింది. పోరాటం ముగించి శాంతిని నెలకొల్పాలని మాత్రమే స్పష్టం చేసింది. ఓటింగ్ కు వచ్చే సరికి రష్యాకు మద్ధతు ప్రకటించింది. కాగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానానికి అనుకూలంగా 93 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా 18 ఓట్లు లభించాయి.