పుణ్యస్నానమాచరించిన నుపూర్ శర్మ
Nupur Sharma took holy bath

లక్నో: బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మ త్రివేణి సంగమంలో మంగళవారం పుణ్య స్నానమాచరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ప్రయాగ్ రాజ్ చేసుకొని స్నానమాచరించారు. గతంలో వివాదాస్పద వ్యాఖ్యల సందర్భంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ఆమె క్షమాపణ చెప్పారు. అడపా దడపా వార్తల్లో కనిపిస్తున్నారు. శ్రీ రామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ప్రత్యేక పూజలకు నుపూర్ శర్మ హాజరయ్యారు. కాగా ఈమె వ్యాఖ్యలపై పలు దేశాల నాయకులు బహిరంగంగానే తమ మద్ధతును ప్రకటించగా, పలుదేశ నాయకులు ఖండించారు.