సంభాల్ హింస.. న్యాయవాదిని చంపే కుట్ర బట్టబయలు
Sambhal violence. Conspiracy to kill lawyer exposed

లక్నో: సంభాల్ హింస కేసు విచారణలో తవ్వుతున్న కొద్దీ భయానక కుట్రలు వెలుగుచూస్తున్నాయి. హింస సందర్భంగా న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ను చంపేందుకు పథకం పన్నినట్లు గురువారం పోలీసు అధికారుల వెల్లడించారు. హింస సందర్భంగా అరెస్టు చేసిన ఒక నిందితుడిని విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. నిందితుడు షరీఖ్ సాతా అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్లు, ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. సాతా దుబాయ్ లో కూర్చొని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ను చంపేందుకు ప్రణాళిక రచించాడన్నారు. హింస సమయంలో జైన్ ను చంపాలని పథకం రచించాడని పేర్కొన్నారు. సంభాల్ హింసలో జరిగిన ప్రణాళికలు, కుట్రకోణాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. వాట్సాప్ గ్రూప్ ల సృష్టి, ప్రజలు గూమిగూడాలని పిలుపు, ఆయుధాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు ఇలా అనేక విషయాలను పోలీసులు రాబట్టారు.